![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ', ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -168 లో.....నర్మద, సాగర్ ఇద్దరు హైదరాబాద్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారని శ్రీవల్లి రామరాజుకి వాళ్ళ ఫొటోస్ చూపిస్తుంది. అవి చూసి వీళ్ళు వెళ్ళింది అందుకేనా అంటూ రామరాజు కోప్పడతాడు. హమ్మయ్య నేను అనుకున్నది జరిగింది అంటూ శ్రీవల్లి కిచెన్ లోకి వెళ్లి డాన్స్ చేస్తుంది. అప్పుడే ప్రేమ వెళ్లి నీకు అవసరమా అక్కా.. మావయ్య నిన్ను ఏమైనా అడిగాడా అని ప్రేమ కోప్పడుతుంది.
అడిగితేనే చెప్తారా ఏంటని శ్రీవల్లి అంటుంది. అప్పుడే వేదవతి వస్తుంది. నువ్వు అనవసరమైన విషయల్లో జోక్యం చేసుకుంటున్నావని అంటుంది. దాంతో అందరు ఒక్కటే.. నేనే వేరు అన్నట్లుగా శ్రీవల్లి యాక్టింగ్ చేస్తుంది. మరుసటి రోజు నర్మద, సాగర్ ఇద్దరు ఇంటికి వస్తారు వేదవతి ప్రేమ దగ్గర వెళ్లి ప్రేమగా మాట్లాడుతారు. రామరాజు వచ్చి ఫోన్ ఎందుకు ఎత్తలేదంటు కోప్పడతాడు.
నేను చెప్పిన పని ఏం చేసావని రామరాజు కోప్పడుతాడు. ట్రై చేసాను నాన్న కానీ వాళ్ళు కలవలేదని సాగర్ చెప్తాడు. అయిన రామరాజు కోప్పడతాడు. తరువాయి భాగంలో మావయ్య గారికి మా ఫొటోస్ ఎందుకు చుపించావని శ్రీవల్లితో గొడవపెట్టుకుంటుంది నర్మద. ఇద్దరు తోడికోడళ్లు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ గొడవ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |